calender_icon.png 22 July, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్‌లో కల్తీ ఆహారం

22-07-2025 12:30:13 AM

- 12 మంది విద్యార్థినులకు అస్వస్థత

- నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలింపు

- ఉదయం తెచ్చిన చికెన్ రాత్రి వండటంతోనే..!

- సంగారెడ్డి జిల్లా మోర్గిలో ఘటన 

నారాయణఖేడ్/నాగల్‌గిద్ద, జూలై 21: కల్తీ ఆహారం తిని 12 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండల పరిధిలోని మోర్గి మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఆదివారం ఉదయం తీసుకొచ్చిన చికెన్ రాత్రి వండి పెట్టడంతో 30 మంది వరకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న 12 మంది విద్యార్థులను రాత్రి  ఆటోలో నారాయణఖేడ్ ఏరి యా ఆసుపత్రికి తరలించారు.

కాగా హాస్టల్‌లో వంట సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. విష యం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ రెడ్డి సోమవారం ఉదయం ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శిం చారు. విద్యా ర్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి  సూపరిండెంట్ డాక్టర్ రమేష్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. విద్యార్థులు అధైర్య పడవద్దని వారికి ధైర్యం చెప్పారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు సూచించా రు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి, గుండె రావు, ముదిరాజ్ శంకర్ ఉన్నారు.

వంట నిర్వాహకులపై చర్యలు: డీఈవో వెంకటేశం

విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి వెంకటేశం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌కు సంబంధించి చికెన్ టెండర్లను రద్దు చేయడంతో పాటు, వంట నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిర్వాహకులతో పాటు ఇతర పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామన్నారు. ఆయన వెంట నాగల్‌గిద్ద ఎంఈవో మన్మధ కిషోర్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రమేష్ ఉన్నారు. కాగా విద్యార్థినులు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పరామర్శించారు.