calender_icon.png 22 July, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం షాపులో భారీ చోరీ

22-07-2025 12:27:22 AM

18 కేజీలు ఎత్తుకెళ్లినట్లు దుండగులు

- బాత్రూంకు రంధ్రం చేసి, గ్యాస్ కట్టర్‌తో షెట్టర్‌ను తొలగించి లోనికి ప్రవేశం

- సూర్యాపేటలోని సాయి సంతోషి దుకాణంలో ఘటన

సూర్యాపేట, జూలై 21 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీరోడ్డులో ఉన్న సాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. బాత్రూంకు రం ధ్రం చేసి, గ్యాస్ కట్టర్‌తో షెట్టర్‌ను తొలగించి లోనికి ప్రవేశించిన దుండగులు.. దాదాపు 18 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లినట్టు తెలుస్తున్నది. షాపు యజమాని తెడ్ల కిషోర్ ఎప్పటిలాగే ఆది వారం సాయంత్రం షాపును మూసివేసి ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం షాపు తెరిచేందుకు తలుపులు తీయగా షట్టర్ పగిలిపోయి ఉన్నది.

లోనికి వెళ్లి గమనించగా దొంగతనం జరిగిందని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇ చ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. షాపు వెనుక భాగంలో బాలాజీ గ్రాండ్ ఎదురుగా గల రెండు బాత్రూంల గోడలకు రంధ్రం చేసి, గ్యాస్ కట్టర్‌తో షాపునకు వెనుక ఉన్న షట్టర్‌ను గ్యాస్‌కట్టర్‌తో తొలగించిన దుండగులు లోపలికి ప్రవేశించి చో రీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. షట్టర్‌ను కట్ చేసేందుకు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్‌లను దుండ గులు ఘటన స్థలంలోనే వదిలి వెళ్లారు.

కాగా ఈ ఘటనలో దొంగలు దుకాణంలోని 18 కేజీల బంగారం ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎస్పీ నరసింహ దుకాణంలో చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కాగా బంగారం షాప్‌నకు అతి సమీపంలోనే గల ఒక పాత ఇంటిలో అద్దెకు ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురే చోరీకి పాల్పడినట్టు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి.