12-01-2026 12:00:00 AM
లాబీయింగ్ చేయటంలో దిట్ట
నన్ను కలవాలంటే ఇంటికి రండి!
ఈ తహసీల్దార్‌కు ఒక న్యాయం దళిత తహసీల్దార్ కు మరొక న్యాయమా!
ఫైరవీకారులకు సూచన!
అవినీతికి కేరాఫ్ అంటే ఆ తహశీల్దార్ దే హవా మామూళ్ళు ఇవ్వనిదే ముందుకు ఫైలు కదలదు మీకు పనులు కావాలంటే ముందు ఇంటిదగ్గర మామూళ్ళు సమర్పించుకోవాల్సిందే. తరువాతే నన్ను కలవాలి అని సార్ ఆదేశాలు ఇస్తారు. ఎందుకంటే కలెక్టర్ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయని అందుకే మీరు ఇంటి దగ్గరకు రావాలని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదే జిల్లాలో అనీషా కు చిక్కిన దళిత అధికారి దామరగిద మండలంలో పనిచేస్తున్న సమయంలోనే చిక్కిన తహసీల్దార్ కు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆ ప్రాధాన్యత పోస్టులో కొనసాగుతున్నారు. ఈ యనకేమో నేతిలో పళ్ళెం లో వంట ఆయన కేమో మట్టి గిన్నెలో అన్నం పెట్టిన చందంగా పాలన తయారైంది.
నారాయణపేట, జనవరి 11 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన ముఖ్యఅధికారి హోదాలో పనిచేస్తూ ఉంటాడు. ఒక ప్రభుత్వ అధికారి, ఉద్యోగి తను ఉద్యోగం చేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడి అవినీతి నిరోధక శాఖాధికారులకు దొరికినట్లు అయితే అటువంటి అధికారులు, ఉద్యోగికి, మాత్రం ఫోకల్, నాన్ ఫోకల్ (ప్రాధాన్యత,అప్రాధాన్యత) కలిగిన పోస్ట్ లో విభజించి కేసు నడుస్తున్న నేపథ్యంలో అటువంటి ఉద్యోగికి అప్రధాన్యత (నాన్ ఫోకల్) కలిగిన పోస్ట్ లో కొనసాగించాలని మార్గ దర్శకాలు ఉండగా అవేమి ఆయనకు ఏమాత్రం లెక్క లేకుండా పోయింది.
జిల్లాలోనే మరికల్ మండలంలో తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలో భూవివాదంలో లంచం తీసుకుంటుండగా అవినీతినిరోధక శాఖాధికారులకు నగదుతో పట్టుబడిన( దొంగ)సం గతి ప్రజలకు తెలిసిందే. అదే అధికారి హైదరాబాద్ లోని సంబంధిత ప్రధాన కార్యాలయంలో లాబీయింగ్ చేసుకొని మొదట జిల్లాలోనే పోస్టింగ్ దక్కింది. దీంట్లో భాగంగానే దామరగడ్డ ఆ వెంటనే కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యఅధికారి హోదాలో ఉన్నారు. కానీ అవినీతి నిరోధక శాఖలో కేసు ఉండగా అలాంటి అధికారికి ప్రజలతో సత్సంబంధాలు ఉన్న పోస్ట్ ఇవ్వరాదని నిభందనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం లాభియింగ్ చేయటంలో దిట్ట. ఈ నేపథ్యంలో ఇటువంటి లంచగొండి అధికారిని ముఖ్య అధికారి స్థానం నుండి తొలగించి అవినీతికి దూరంగా ఉండే సమర్థులైన అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
కలెక్టర్ కార్యాలయం అంటేనే ప్రజలకు జవాబుదారీత నం, పారదర్శకత ఉండే కార్యాలయంగా ఉండాలే కానీ అవినీతి అధికారులకు స్థానం లేకుండా చూడాలని కోరుతున్నారు మరి రాబోయే రోజుల్లో కలెక్టర్ కార్యాలయం అవినీతి అధికారులకు కొమ్ము కాస్తుందా.. లేదా అవినీతికి తావు లేకుండా ప్రజలకు పారదర్శకతో కూడిన పాలన అందిస్తుందా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే జిల్లాలో ఇద్దరు రెవెన్యూ శాఖలో తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలో కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారి పెద్ద మొత్తంలో నగదు తీసుకుంటుండగా అవినీతినిరోధక శాఖాధికారులకు పట్టుబడగా ఇంకో తహసీల్దార్ కేవలం 5000 రూపాయలు మాత్రమే తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు పట్టుబడగా ఈయనేమో కలెక్టర్ కార్యాలయంలో రెండు ప్రాధాన్యత పోస్టులో కొనసాగుతున్నారు. దళిత అధికారి మాత్రం స్తానిక ఆర్డీవో కార్యాలయంలో ప్రాధాన్యత పోస్టులో కొనసాగుతున్నారు. ఇద్దరు ఒకే గొడుగు కింద పనిచేస్తున్న అధికారులే కదా ఒకరికేమో బంగారు పళ్ళెంలో వడ్డిస్తే ఒకరికేమో మట్టి పళ్ళెంలో వడ్డించటం ఎంతవరకు సబబు అని సర్వత్రా విమర్శలు సైతం ఉన్నాయి. ఇకనైనా ఇద్దరు అధికారులకు ఒకే న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.