calender_icon.png 12 January, 2026 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడ సంఘం సంక్షేమం కోసం కృషి చేస్తాం

12-01-2026 12:00:00 AM

గౌడ సంఘం అధ్యక్షుడు వేముల కేశవ నాధం గౌడ్

పవన్ సాయి హాస్పిటల్ అధినేత ఆలేటి శ్రీనివాస్‌గౌడ్

మేడిపల్లి,జనవరి 11 (విజయక్రాంతి): గౌడ సంఘం సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆదివారం జిహెచ్‌ఎంసి పరిధి బోడుప్పల్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆ సంఘం నేతలు వేముల కేశవనాథం గౌడ్,పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీనివాస్ గౌడ్,జై గౌడ్ ఉద్యమ ఉపాధ్యక్షులు కొంపల్లి వెంకట్ గౌడ్ లు అన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ గౌడ సంఘం ఆధ్వర్యంలో గీత కార్మి కుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమం లో సదానందం గౌడ్,ప్రధాన కార్యదర్శి రంగా నాగభూషణం గౌడ్, ట్రెజరర్ బత్తుల సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు కోటి లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యక్షులు ఉక్కూరి రమేష్ గౌడ్, ప్రచార కార్యదర్శి పల్లె మల్లేశం గౌడ్, సహాయ కార్యదర్శి, బాల్ రాజు గౌడ్, కార్యవర్గ సభ్యులు వి. భాస్కర్ గౌడ్, ఎం రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.