calender_icon.png 12 January, 2026 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం పదిలంగా చూసుకోండి

12-01-2026 12:00:00 AM

జడ్చర్ల, జనవరి 11: మండలం బూర్గుపల్లి గ్రామంలో గరుడ యువసేన ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఎస్వీఎస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో బూర్గుపల్లి గ్రామంలో ఉచిత ఆరోగ్య, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని బూర్గుపల్లి గ్రామ ప్రజలందరికీ ‘జనరల్ హెల్త్ ప్రొఫైలిoగ్‘ అవగాహన శిబిరాన్ని  నిర్వహించారు.  రక్తదానం అన్ని దానాల కన్నా శ్రేష్టమైందని, అన్నదానం ఆకలి బాధలు తీరిస్తే రక్తదానం మరో మనిషికి పునర్జన్మణిస్తుందని డాక్టర్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గరుడ యువసేన ఆర్గనైజేషన్ సభ్యులు, యువకులు మరియు గ్రామ పెద్దలు, శివ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.