calender_icon.png 28 November, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగయ్య మరణం పార్టీకి తీరని లోటు

28-11-2025 01:04:58 AM

- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు

ముకరంపుర, నవంబరు 27 (విజయ క్రాంతి): టిడిపి సీనియర్ నాయకుడు కళ్యాడపు ఆగయ్య మరణం పార్టీకి తీరని లోటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు అన్నారు. గురువారం నగరంలోని మధు గార్డెన్ లో ఆగయ్య దశదినకర్మను నిర్వహించారు. బక్కని నరసింహులు హాజరై ఆగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి వారి కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సూచన మేరకు ఆగయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంగా అందిస్తామ ని ప్రకటించారు. ఆగయ్య మనమరాలు చదువు బాధ్యత మొత్తం పార్టీనే భరిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ వంచ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఆవు నూరి దయాకర్ రావు, దామెర సత్యం, రొడ్డ శ్రీనివాస్, ఎర్రవెల్లి రవీందర్, తీగుట్ల రమేష్ కుమార్, రోడ్డ శ్రీధర్, ఆకుల కాంతయ్య, లొంక భాస్కర్ శర్మ,దాసరి రామకృష్ణారెడ్డి, సంద బోయిన రాజేశం,మోరే ప్రభాకర్, ఎర్రవెల్లి వినిత్, దాసారపు సాగర్, ఎలిమిల కిషన్, బోలుమల్ల సదానందం, ఇట్టా మల్లేశం, హయగ్రీవ చారి, ఉప్పు నారాయణ, కృష్ణ కుంభకర్, మంగళారపు శ్రీనివాస్ రెడ్డి, అక్కపాక తిరుపతి, తదితర నాయకులుపాల్గొన్నారు