28-11-2025 01:05:47 AM
కొత్తగూడెం, నవంబర్ 27, (విజయక్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం లోని ప్రాణ ధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్, రెస్క్యూ సభ్యుడు శ్రీకాంత్ (చోటు) కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వచ్చిన పలు సర్పాలను, స్థానికుల సమాచారం మే రకు సురక్షితంగా వాటిని అదుపులోకి తీసుకొని వాటిపై స్థానిక ప్రజలకు,అవగాహన కల్పించిన అనంతరం గురువారం నాలుగు సర్పాలను (వాటిలో మూడు నాగుపాము లు ఉండగా ఒక జెర్రి పోతు పాము) దట్టమైన అటవీ ప్రాంతంలో విడుదల చేశారు.
హానీ జరగకుండా, చూడడమే తమ ఉద్దేశ్యమని,ఇళ్ల లోపలకి చేరకుండా తలుపులు కి టికీల కు జాలి అమర్చుకుంటే సమస్య ఉం డదని, సర్పాలు ప్రకృతిలో భాగమేనని వా తావరణంలో మార్పులు ఆహారం కోసమే, సర్పాలు బయటకు వస్తాయని ప్రత్యేకించి, చలి కాలంలో వెచ్చదనం కోసం ఇళ్ల లోపలికి వస్తాయని, రాత్రులు వెలుతురు ఉండే లా జాగ్రత్త పడాలని స్నేక్ క్యాచర్ సంతోష్ వివరించారు.