28-11-2025 01:04:27 AM
అశ్వాపురం, నవంబర్ 27 (విజయక్రాంతి): మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు గురువారం వేడిక వేడి గా కొనసాగింది . మల్లెలమడుగు గ్రామం లో కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా మ చ్చ నరసింహారావు నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై అభ్యర్థికి తమ మద్దతును తెలిపారు. అదే విధంగా గొందిగూడెం నుంచి కాకా రాములు, తుమ్మలచెరువులో ఎట్టి నరేష్, రామచంద్రాపురం నుంచి భూరె డ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు.
మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో నామినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా సాగుతుండగా, ఇప్పటి వరకు 7 గ్రామపంచాయతీలకు 15 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులుగా 16 మంది పో టీదారులు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామాల్లో పాత వర్గాలు,కొత్త వర్గాల మధ్య పోటీ ముదురుతుండగా, యువ నాయకుల రంగ ప్రవేశం సర్పంచ్ పీఠాల కోసం హోరాహోరీ పోటీని తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో నామినేషన్ ప్రక్రియ మరింత ఊ పందుకునే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనావేస్తున్నారు.