04-11-2025 12:00:00 AM
మనిషి పుటింది మొదలు గిట్టే వరకు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది. మనిషి తన మేధస్సుకు, మనుగడకు ఎదురయ్యే ప్రతి సమస్యలను, సవాళ్ళను అధిగమించి ఎప్పటికప్పుడు వాటిని అవకాశాలుగా మార్చుకుంటూనే వస్తున్నాడు. తాజాగా కృత్రిమ మేధస్సు (ఏఐ) మానవునికి సవాల్‌గా మారుతుందా అన్నది ఆలోచించాల్సిన అంశం.
తన శారీరక శ్రమను తగ్గించుకోవడానికి అనేక రంగాల్లో పరిశోధనలు చేసి వాటికి పరిష్కార మార్గాలు కనుగొన్నాడు. ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న ఏఐ కూడా మానవ సృష్టే అన్న విషయం మరువొద్దు. తన సౌలభ్యం కోసం సృష్టించిన ఏఐ ఇవాళ సొంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవడమే కాదు అత్యంత వేగంగా, దోషరహితంగా పనిచేస్తుంది. మరి ఏఐ వరమా? శాపమా అన్న విషయాన్ని గమనిస్తే.. ఏఐ వచ్చి న తర్వాత సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగుల లేఆఫ్స్ పెరిగిపోతున్న వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాం. నిజానికి ఏఐ రావడం వల్లనే ఉద్యోగాలు ఉడిపోతున్నాయనేది కేవలం అపోహ మా త్రమే.
ఎందుకంటే ఏఐను సృష్టించింది మానవుడే. దానిని నియంత్రించే శక్తి కానీ, మెరుగుపరిచే సాంకేతికత కానీ మానవుడికే ఉంటుంది తప్ప ఏఐ తనంతట తానుగా అప్‌గ్రేడ్ చేసుకోలేదు. ఏఐ అప్‌గ్రేడ్ కోసం మళ్లీ మానవుడి తెలివితేటలే అవసరం అన్న విషయాన్ని గ్రహించండి. ఏఐ ఎప్పుడూ మనిషికి సేవకుడే కానీ పోటీదారుడు ఎంతమాత్రం కాదు. ఏఐను దాటడానికి పరిష్కార మార్గాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి.
నైపుణ్యాలు పెంచుకోవడం, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులతో ఏఐపై పట్టు పెంచుకోవడం చేయాలి. ఏఐ మనిషిలా ఆలోచిస్తుంది, కానీ మనిషిని మంచి సృజనాత్మకతను చేయలేదు. కళ, సాహిత్యం, సంగీతం, డిజైన్ రంగాలు ఎప్పటికీ సురక్షితమే. మానవుని భా వాలు, ఊహలు ఏఐకి ఎప్పటికీ రావు. మారుతున్న సాంకేతిక యుగంలో ఏఐ తదనంతరం కూడా కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తూనే ఉంటుంది. వాటిని సృష్టించేది కూడా మానవుడే అనేది సత్యం. ఏఐ నిర్వహణ, ఏఐ ఎథిక్స్, ఏఐ భద్రత, గ్రీన్ టెక్నాలజీ, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ రంగాలు భవిష్యత్తులో మరింత విస్తరించనున్నాయి.
నిరుద్యోగాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. ప్రతీ మార్పు కొత్త అవకాశం కోసమే అన్నది గుర్తుంచుకోవాలి. కొన్ని దశాబ్దాల కిందట అనేక నూతన యంత్రాలు, కంప్యూటర్ పరికరాలు వచ్చినప్పుడు కూడా కార్మికులు, ఉద్యోగులు ఇదే విధంగా భయపడ్డారు. కానీ ఎన్ని యంత్రాలు, పరికరాలు తయారైనా వాటిని ఆపరేట్ చేయాల్సింది మనుషులే. ఎందుకంటే వాటంతట అవి ఆపరేట్ చేసుకోగలిగే శక్తి ఉన్నా ఎంత మోతాదులో కావాలన్నది నిర్ణయించాల్సింది మనమే అన్న విషయం తెలుసుకోవాలి. మానవుని కోరికలు, అభిరుచులు అనంతం.
వాటిని తీర్చుకోవడానికి మానవుడు ఎప్పటికప్పుడూ తన సృజనాత్మకతకు పదును పెడుతూనే ఉన్నాడు. ఇప్పు డు వచ్చిన ఏఐ విషయంలోనూ అదే జరుగుతుంది. ఏఐ పట్ల భయం, నిరుత్సాహం, నిస్తేజం అనవసరం. మానవుని ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్లుగా మారే ఆలోచనా విధానం ఏఐలో లేవు. ఏఐ మానవ చరిత్రను మారుస్తుంది. కానీ మానవుడు దాని సృష్టికర్త అని మరువద్దు. ఏఐని ఉపయోగించి సమాజాన్ని మెరుగుపరచాలి. అలాగే ఏఐ యుగం ఎప్పటికీ మానవుని విజయమే.
కోలాహలం రామ్ కిశోర్, 9849328496