calender_icon.png 17 January, 2026 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దావోస్ వేదికగా ఏఐ ఇన్నో వేషన్ హబ్

17-01-2026 03:18:46 AM

  1. తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే దిశలో ముందడుగు
  2. రాష్ట్రంలో ఏఐ భవిష్యత్ నిర్మించాలని ప్రపంచ దేశాలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయి లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఒక కొత్త సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే దిశలో ఒక చారిత్రాత్మక అడు గుగా, రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (టీఏఐహెచ్)ను దావోస్‌లో ప్రా రంభించనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ఈనెల 20న ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఏఐ పరిజ్ఞానాన్ని, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్వతంత్ర సంస్థగా టీఏఐహెచ్ ప్రపంచంలోనే తొలి ‘ప్రపంచ ఏఐ ప్రయోగ వేదిక’గా పనిచేస్తుంది.

ఇప్పటిదాకా భారతదేశపు టెక్నాలజీ రంగపు కేంద్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ప్రపంచ నూతన ఆవిష్కరణల రాజధానిగా మారిపోయిందని  సీఎం చెప్పారు. నూతన ఆవిష్కరణలు, ప్రతిభల మేలుకలయికగా ఉన్న తెలంగాణలో ఏఐ భవిష్యత్‌ను నిర్మించడానికి ప్రపంచదేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రపంచానికి మరో ఇంక్యుబేటర్ అవసరం లేదని, ఒక ఇన్నోవేషన్ శాండ్ బాక్స్ అవసరం ఉందని అన్నారు.

టీఏఐహెచ్ ప్రారంభం ద్వారా తాము ప్రపం చ స్థాయి మౌలిక సదుపాయాలతో డీప్ టెక్ రంగాల్లో అత్యాధునిక ఆవిష్కరణలకు వేదికను ఏర్పా టు చేస్తున్నామని, ఇక్కడ అత్యంత సురక్షితమైన, ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ ఉత్పత్తులు తెలంగాణ లో రూపుదిద్దుకుంటాయని చెప్పా రు. కాగా టీఏఐహెచ్‌ను ప్రారంభించడం ద్వారా తెలంగాణ ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేసి, ప్రపంచంలోని టాప్20 ఇన్నో వేషన్ హబ్‌లలో ఒకటిగా తెలంగాణను నిలపడం తమ లక్ష్యమని టీఏఐహెచ్ సీఈఓ ఫణి నాగార్జున చెప్పారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ అధికారిక ప్రారంభం ఈనెల 20న సాయంత్రం 7 నుంచి 8.30 గంటల వరకు, దావోస్‌లోని మౌంటెన్ ప్లాజా హోటల్‌లో జరుగుతుంది.