calender_icon.png 17 January, 2026 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరగాళ్లు పంపే లింకులను ఓపెన్ చేయరాదు

17-01-2026 03:19:43 AM

ఎస్‌ఐ రమేష్ బాబు

ఎర్రుపాలెం జనవరి 16 ( విజయక్రాంతి): వాట్సాప్ లలో వైరల్ అవుతున్న మొదట నకిలీ అనుకున్నానూ& కానీ నాకు రూ.5,000 వచ్చింది! లింక్ స్కామ్.. ఇలాం టి వాట్సప్ కు వచ్చే నకిలీ లింకులను ఓపెన్ చేసి మోసపోవద్దని, వేరొకరికి షేర్ చేయొద్దని ఎర్రుపాలెం ఎస్త్స్ర రమేష్ కుమార్ సూచించారు. ఇలాంటి లింకులను ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

వాట్సాప్లో ఒక సందేశం తో మొదట నకిలీ అనుకున్నానూ..కానీ నా కు 5,000 వచ్చింది! అంటూ ఒక లింక్ వైరల్ అవుతోంది. పెద్ద మొత్తానికి బహుమతి అందిందని చెప్పి లింక్ క్లిక్ చేయమని అంటున్నా ఇది వాస్తవంలో నకిలీ స్కామ్ అని సైబర్ నేరగాళ్లు ఇలాంటి లింకులను పంపిస్తున్నారని ఎస్త్స్ర హెచ్చరించారు. .

ఈలా వచ్చే లింక్లు సాధారణంగా ఫిషింగ్ / స్కామ్ లాటరీ సందేశాలు చేస్తూ, వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంక్ వివరాలు సేకరించి అందులో నగదు దోచుకోవడానికి ప్రయత్నిస్తాయి నిజమైన సంస్థల నుండి ఇలాంటి లింక్లు రావు అని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు ఇలాంటి సందేశాలను ఒకసారి ఆలోచించి, లింక్ క్లిక్!చేయకుండా ముందుగానే తొలగించి, పంపిన నెంబర్ను బ్లాక్ చేసి, అవసరమైతే పోలీస్ సిబ్బందికి ,సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఎస్త్స్ర రమేష్ కుమార్ పేర్కొన్నారు.