పెద్ద కొడప్గల్ మండల అధ్యక్షురాలు ఇందిరమ్మను సన్మానించిన ఏఐసీసీ అబ్జర్వర్
పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియలో భాగంగా నిజాంసాగర్ మండలకేంద్రం నకు శుక్రవారం వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్ రాజా గోపాల్ ఖరోలా పెద్ద కొడప గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరమ్మను బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజక వర్గ స్థాయి సమావేశానికి కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఇందిరా గాంధీ,సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ లాంటి గొప్ప మహిళా నేతలు ఉన్న మన కాంగ్రెస్ పార్టీలో మహిళలు రాకపోవడం బాధాకరమన్నారు.మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎక్కువ సంఖ్యలో మహిళలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలని ఆయన కోరారు.
పెద్ద కొడప్ గల్ మండల కాంగ్రెస్ నాయకులందరూ ముక్తకంఠంతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్ ను నియమించాలని కోరారు. అలాగే జుక్కల్ నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవ్వరికీ మంత్రి పదవి రాలేదని అబ్జర్వర్ కు తెలిపారు. విద్యావేత్త, మేధావి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావ్ కు మంత్రి పదవి ఇస్తే వెనుక బడిన జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.






