calender_icon.png 17 October, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయిపై దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన

17-10-2025 08:41:33 PM

చిలుకూరు: మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తూ వినతి పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ పుష్పలతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మల్లేపంగు సూరిబాబు మాదిగలు. మాట్లాడుతూ, సుప్రీం కోర్ట్ జస్టిస్ బిఆర్ గవాయి పై దాడి  చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి, వారికి కూడా శిక్ష పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలని  సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక  వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ జరిపించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.