సీపీఆర్ పద్ధతి ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చు
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని నగరపాలక సంస్థ ఆవరణలో గల కళాభారతి తో శుక్రవారం రోజు సిపిఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ సమక్షంలో మున్సిపల్ పలు విభాగాల అధికారులు, సిబ్బందికి సిపిఆర్ పద్దతి పై అవగాహన కల్పించారు. ఒక వ్యక్తి హఠాత్తుగా కుప్ప కూలీనప్పుడు ప్రాణాప్రాయ స్థితి నుండి రక్షించడానికి కార్డియో పల్మనరీ రీససిటేషన్ చేయాల్సిన పద్దతి, పాటించాల్సిన జాగ్రత్త చర్యలు మెలకువల పై జిల్లా వైద్యాధికారి , వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.
పలు విభాగాలకు చెందిన అధికారులతో కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ సమక్షంలో సీపీఆర్ పద్దతిపై మానేక్విన్ మీద మాక్ డ్రిల్ రూపంలో లైవ్ డెమోన్ట్రేషన్ చేశారు. ఉద్యోగులకు సిపిఆర్ టెక్నిక్ పద్దతులను నేర్పించారు. ఈ సందర్బంగా కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ మాట్లాడుతూ... ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలను తీర్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది కార్డియో పల్మనరీ రీససిటేషన్ పద్దతి మెలకువలను తప్పక నేర్చుకోవాలని పిలుపు నిచ్చారు. వ్యక్తి గండె ఆగిపోయి పడిపోయినప్పుడు సిపిఆర్ మాత్రమే రక్త ప్రసరణను తిరిగి అవయవాలకు పంపించి ప్రాణాలను రక్షించే మార్గం అన్నారు.
ప్రస్తుత మన జీవనశైలితో తీసుకునే ఆహారపు అలవాట్లతో మనకు తెలియకుండానే మనలో ఎన్నో ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. మన జీవన శైలీలో మార్పులు తెచ్చుకోవాలని శారీరక వ్యాయామం లాంటివి అలవాటు చేస్కోవాలని ఉద్యోగులకు సూచించారు. మానసిక ఓత్తిడిని తగ్గించుకొవాలని యోగా వ్యాయామం చాలా ముఖ్యమన్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఉద్యోగుల కోసం త్వరలో ఒక వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు, సిబ్బంది సిపిఆర్ పై అవగాహన పెంచుకొని ప్రాణాప్రాయ స్థితి లో వ్యక్తులను కాపాడాలని అన్నారు.






