24-01-2026 02:55:47 PM
కేసీఆర్ పాలనలో ఫోన్లు మాట్లాడేందుకు భయపడేవారు
హైదరాబాద్: కేసీఆర్ హయాంలో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అనేది వివాదాస్పదం అయిందనిమంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నో ఏళ్లుగా ఉందని మంత్రి జూపల్లి వెల్లడించారు.కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పాలనలో ఫోన్లలో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలే భయపడేవారని వివరించారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చాలామంది నేతలు గతంలో చెప్పారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే.. చేసి ఉండొచ్చని స్వయంగా కేటీఆర్ ఒప్పుకున్నారని జూపల్లి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను కేవలం సాక్షిగానే విచారణకు పిలిచినట్లు వెల్లడించారు.
కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) ప్రజల స్వేచ్ఛను హరించేలా జరిగిందని జూపల్లి ఆరోపించారు. నేతలు, వ్యాపారులు మాట్లాడుకున్నది కూడా దుర్మార్గంగా విన్నారని సూచించారు. రాజకీయ కక్ష సాధించాలనుకుంటే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అయ్యేవాళ్లని వ్యాఖ్యానించారు. ప్రజాధనంతో నడిచే ఎస్ఐబీని సొంత అవసరాలకు వాడుకుని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఎవరైనా అవినీతికి పాల్పడినప్పటికీ దర్యాప్తులు జరగవద్దని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు?.. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలను కూడా విచారణకు పిలిచినట్లు జూపల్లి వెల్లడించారు.