20-09-2025 12:00:00 AM
అమీన్పూర్, సెప్టెంబర్ 19 : అవకాశం వస్తే ప్రజా సేవ చేయడం వేరు.. కానీ ప్రజా సేవే పరమావధిగా మలుచుకొని ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడడం కొందరికే సాధ్యం. ఆ కోవలోకే ఐలాపూర్ మాణిక్ యాదవ్ వస్తారు. చిన్నతనం నుండి కష్టాలను ఎదర్కొని మొక్కవోని ధైర్యంతో ఉన్నత విద్యావంతుడిగా ఎదిగి, రాజకీయంలో తనకంటూ ముద్ర వేసి ప్రజా సేవలో తలమునకలయ్యారు ఐలాపూర్ మాణిక్ యాదవ్.
రైతు కుటుంబంలో పుట్టి అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ట్యూషన్లు చెప్పుకుంటూ బీటెక్, ఎంటెక్, ఎఎల్బీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక నిపుణుడైన అడ్వకేట్గా పనిచేస్తూ ప్రజలకు లీగల్ సర్వీసులు ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం మాణిక్ యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీలో క్రీయాశీల నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. ప్రజా సేవల పట్ల మక్కువ, పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండడం అతని నైజం.
రైతు బిడ్డగా.. ప్రజల మనిషిగా..
ఐలాపూర్ మాణిక్ యాదవ్ రైతు కుటుంబంలో పుట్టి పెరిగారు. వ్యవసాయ కష్టాలు చూసి పెద్దవారైన ఆయన విద్యారంగంలో కష్టపడి ముందుకు సాగారు. తనలాగే కష్టపడే మనస్తత్వం ఉన్న వారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు.
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలకు పరిష్కా రం చూపించేందుకు కృషి చేస్తున్న నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్. చిన్నవయసులోనే సామాజిక సేవలపై ఆసక్తి పెంచుకొని, బీఆర్‌ఎస్ పార్టీ సిద్దాంతాలను ప్రజల్లో విస్తృతంగా చేరవేయడానికి కృషి చేస్తున్నారు.
పార్టీకి నమ్మకమైన నేతగా...
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా పట్టుకుని నడిపించిన వ్యక్తి మాణిక్ యాదవ్. ఎప్పుడూ పార్టీకి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. తన చదువులన్నీ ప్రజల కోసమే&నా వృత్తి కూడా ప్రజా సేవకోసమే.. పార్టీ నమ్మకమే నా బలం.. ప్రజల ఆశీస్సులే నా ఆస్తి అని మాణిక్యాదవ్ చెబుతుంటారు.
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శుద్ధి నీరు, డ్రైనేజ్, విద్యుత్ సమస్యలు, పబ్లిక్ ఫెసిలిటీస్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తూ, వృద్ధులు, మహిళలకు సహాయం చేస్తున్నారు.
కార్పోరేటర్‌గా గెలవడమే లక్ష్యం..
ప్రస్తుతం మాణిక్ యాదవ్ భవిష్యత్తులో కార్పొరేటర్ పదవికి పోటీ చేసి, ప్రజల ఆశీస్సులతో గెలిచి, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే సంకల్పాన్నిపెట్టుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు, బిఆర్‌ఎస్ సీనియర్ నేతలు ఇచ్చే మార్గదర్శకత్వంతో ముందుకు సాగుతూ, ప్రజా సేవను జీవిత లక్ష్యంగా కొనసాగిస్తున్నారు. ప్రజల నుండి కూడా మంచి స్పందన లభించడమే కాకుండా ఆశీస్సులుకూడాఉన్నాయి.