13-09-2025 02:49:42 AM
చేగుంట, సెప్టెంబర్ 12 :చేగుంట ప్రాథమిక సహకార సంఘ నూతన అధ్యక్షుడిగా ఆయిత రఘురాములు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు కార్యవర్గాన్ని సొసైటీ సీఈఓ సందీప్ శాలువాలతో సన్మానించారు, ఈ సందర్భంగా అయిత రఘరాములు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, 990 మంది సభ్యులు ఉండగా, రూ.2.39 కోట్ల రుణాలు అందించడం జరిగిందని, నూతన సొసైటీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని, రైతులకు ఎరువులు, విత్తనాలు అందించేందుకు కూడా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
సొసైటీ ద్వారా 260 మందికి పంట రుణాలు, 13 మందికి ఎల్టి లోన్లు అందించా మన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబి మేనేజర్ శశికాంత్ రెడ్డి, ఫీల్ ఆఫీసర్ శ్రీమాన్, సొసైటీ సీఈఓ సందీప్, డైరెక్టర్లు సిద్ధిరాములు, కుమార్ రమేష్, రాములు, నరసమ్మ, బలరాం, సొసైటీ కార్యాలయ సిబ్బందిపాల్గొన్నారు.