13-09-2025 02:48:11 AM
చేగుంట, సెప్టెంబర్ 12 :చెగుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించి, వారికి పురస్కారాలు అందించారు.
ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసిం చాలని ,కష్టపడి, ఇష్టపడి చదివి, మంచి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూ చించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,చేగుంట మాజీ ఏఎంసీ చైర్మన్ రజనక ప్రవీణ్ కుమా ర్,పిఏసిఎస్ చైర్మన్ ఐతె రఘురాం,ఐతె పరంజ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ కర్రి అనిత, కళాశాల సిబ్బంది, చేగుంట సబ్ ఇన్స్పెక్టర్ చైతన్య రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.