10-09-2025 12:33:06 AM
గోదావరిఖని, సెప్టెంబర్ 09(విజయ క్రాంతి)గోదావరిఖనిలో సింగరేణి గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. గత కొంతకాలంగా సింగరేణిలో మారుపేరు కార్మికుల డిపెండెంట్ ల సమస్య ప్రధానంగా ఉంది. విజిలెన్స్ విచారణ పేరుతో తమకు ఉద్యోగాలు రాకుండా యాజమాన్యం జాప్యం చేస్తుందని, ఇప్పటికే మారు పేర్లు బాధితులు అ నేక దఫాలుగా ఉద్యమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇప్పటికే సింగరేణిలో గుర్తింపు సంఘం అయిన ఏఐటీయూసీ, ప్రాతినిత్య సంఘం ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ సంఘాల నాయకులు మారుపేర్ల బాధితులు ఎదురుపడ్డప్పుడు ఒక రెండు రోజుల్లో మీ సమస్యను పరిష్క రిస్తామని హామీలు ఇచ్చి తర్వాత తోక ముడుస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం గోదావరిఖని భాస్కర రావు భవన్ ఏఐటీయూసీ కార్యాలయం ఎదుట మారు పేర్లు ధర్నా చేపట్టారు.
అక్కడికి వచ్చిన ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కాళ్లపై ఒక్కసారి పడి బాధితులంతా పొర్లు దండాలు పెట్టారు. మా జీవితాలతో ఆడుకోవద్దంటూ కన్నీటి ప్రజాతమయ్యా రు. గుర్తింపు సంఘం కు వ్యతిరేకంగా మిన్నంటిన నినాదాలు చేశారు. గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోలేదని బాధితులంతా తమ ఆవేదనను వెళ్ళగక్కారు.
గుర్తింపు, ప్రాతినిత్య సంఘాల తో ఎలాంటి పనులు జరగవని, కేవలం పైరవీలకే మీరంతా పనిచేస్తారని అందరి సమక్షంలోనే నిలదీశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య మాట్లాడుతూ తమ వంతుగా మీ సమస్యను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్తామని, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం వెళ్తే సమయం ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు.