calender_icon.png 11 September, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపపిల్లల పంపిణీపై ప్రభుత్వం నిర్లక్ష్యం

10-09-2025 12:31:58 AM

- హస్తం నాయకుల జోక్యంతోనే ఆలస్యం

సిద్దిపేట, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి):రాష్ట్రంలోని ముదిరాజ్, మత్స్యకారుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు, బి.ఆర్.ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేపల టెండర్లలో అధికారులు, హస్తం నాయకుల జోక్యంతోనే కాలయాపన జరుగుతోందనీ, గత సంవత్సరం చేప పిల్లలు ఇవ్వలేదు, ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయని మండిపడ్డారు.

జూన్, జూలైలోనే చేప పిల్లలు వదిలాలి కానీ ఇప్పటికీ టెండర్లు పూర్తిచేయకపోవడం మత్స్యకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో 100 శాతం చెరువులు, కుంటలు, డ్యాముల్లో చేప పిల్లలు వదిలారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చకా ముదిరాజ్, మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మేడికాయల వెంకటేశం, జిల్లా నాయకులు రెడ్డి యాదగిరి ముదిరాజ్, కొనయ్యగారి ఎల్లం, ఇట్టమేన శ్రీనివాస్, శ్రీనివాస్, గాడిచర్ల నాగరాజు, కొత్త శంకర్, యాట రాజేష్, శిలాపూర్ రాజు, మైలారం వంశీ తదితరులుపాల్గొన్నారు.