30-10-2025 07:12:33 PM
డీసీపీ పద్మజ
ఉప్పల్ (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని మల్కాజ్గిరి డీసీపీ పద్మజ అన్నారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్లో 11 పోలీస్ స్టేషన్లో సమ్యుక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆమె ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 ఇండో చైనా సరిహద్దులో జరిగిన సంఘటనలో పదిమంది జవాన్లు వీరమరణం పొందరని దీనిగాను ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు.
పోలీస్ అమరులు వారోత్సవాలలో ప్రజలను భాగ్య స్వామి చేసే ఉద్దేశంతోనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలు మనకు అందరికీ స్ఫూర్తి అన్నారు. పగలు రాత్రి లేకుండా సమాజంలో శాంతి భద్రతను కాపాడుతూ పోలీసుల సేవలను డీసీపీ కొనియాడారు. రక్తదానం వలన అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలు కాపాడుతుందన్నారు సామాజిక బాధితుగా అందరు రక్తదానం చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా 529 మంది పౌరులు మరియు పోలీసు అధికారులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిరి ఏసీపీ చక్రపాణి కుషాయిగూడ ఏసిపి వెంకట్ రెడ్డి మల్కాజిగిరి జోన్ చెందిన అన్ని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మరియు సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.