30-10-2025 06:20:02 PM
- వర్షాలకు నేలకొరిగిన వరి సాగుపై ఉప్పు ద్రావణం పిచికారి చేయాలి
- ఏడిఏ వేణుగోపాల్
మునుగోడు (విజయక్రాంతి): రైతులు నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించి ప్రభుత్వం అందించే వరి, పత్తి పంటలకు మద్దతు ధర పొందాలని మునుగోడు వ్యవసాయ సహాయ సంచాలకులు వేణుగోపాల్ అన్నారు. గురువారం మండలంలోని సింగారం గ్రామంలో మొoత తుఫాను గురిఅయిన పంటలను మండల వ్యవసాయ అధికారి ఎస్ పద్మజతో కలిసి వరి, పత్తి పంటలను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతము వర్షానికి గురై వరి పంట కోతకు సిద్ధంగా ఉండి పడిపోయినట్లయితే గింజలు మొలకలు రాకుండా ఉండాలంటే రైతులు లీటర్ నీటికి 50 గ్రాముల ఉప్పును కలిపి పిచికారి చేసుకున్నట్లయితే వరి గింజలు మొలకలు రాకుండా రంగు మారకుండా కాపాడుకోవచ్చు అని తెలియజేశారు.
పత్తి పంట రెండు మూడు రోజులు ఎండ గాలులు వీచిన తర్వాత పంటను తీసుకోవాలి అని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసుకున్న కుప్పలను తడవకుండా టార్పాలిన్ పట్టాలతో జాగ్రత్తగా కాపాడుకోవాలని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మాధగోని నరసింహ, కుంభం దయాకర్ రెడ్డి, రావుల మల్లేష్, వెంకట్ రెడ్డి, సోమగోని రామస్వామి, లింగస్వామి ఉన్నారు.