calender_icon.png 30 October, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ కు సన్మానం..

30-10-2025 07:07:58 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్పీఎఫ్ అవుట్ పోస్ట్ ను గురువారం రామగుండం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె రాజేంద్రప్రసాద్ విజిట్ చేశారు. ఆయన రికార్డులు తనిఖీ చేశారు. క్రైమ్ వివరాలు తెలుసుకున్నారు. బెల్లంపల్లి ఆర్పీఎఫ్ మోహన్ వివరాలు తెలిపారు. అయితే ఇన్స్పెక్టర్ వచ్చిన విషయం తెలిసిన మాదిగ హక్కులదండోరా నేతలు వచ్చి ఈ సందర్భంగా శాలువాకప్పి పూల పుష్పగుచ్చం అందించి సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి రాజం మాదిగ, ఎక్స్ కౌన్సిలర్ లింగంపల్లి రాములు మాదిగ, సీనియర్ నాయకులు పుల్లూరి కనకరాజు మాదిగ, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కాంపెల్లి సతీష్ కుమార్ మాదిగ, ప్రధాన కార్యదర్శి గద్దల కుమారస్వామి మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనగందుల నరేష్ మాదిగ, కార్యదర్శి కడప శంకర్ మాదిగ పాల్గొన్నారు.