calender_icon.png 30 October, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొంథా తుఫాన్ తో మంథనిలో రైతులకు నష్టం

30-10-2025 07:40:08 PM

వర్షానికి కొట్టుకుపోయిన వరి, తడిసి ముద్దయిన పత్తి ఆందోళనలో రైతులు..

రైతులు ఆందోళన వద్దు, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: మంత్రి శ్రీధర్ బాబు..

మంథని (విజయక్రాంతి): మొంథా తుఫాన్ తో మంథనిలో రైతులు నిండా మునిగారు. ఈ వర్షానికి చేతికి వచ్చిన వరి, పత్తి పంటలు తడిసి రైతులకు భారీ నష్టం జరిగింది. దీంతో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలాల్లో తీవ్రనష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంథని గోదావరి నది, ముత్తారం మండలంలోని మానేరు నది ఉదృతంగా ప్రవహించడంతో లోతట్టు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. 

తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన పడవద్దు 

ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: మంత్రి శ్రీధర్ బాబు

మొంథా తుఫానుకు పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ప్రకటనలో తెలిపారు. త్వరలోనే నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులకు సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. వాతావరణంలో వచ్చిన మార్పుల ద్వారా తుఫాన్ లు సంభవించి రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి తుఫానుల ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతితో సంభవించిన నష్టానికి రైతులు ఎంతో నష్టపోతున్నారని, ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.