30-10-2025 07:28:09 PM
చెరువులకు చేటు.. నానాటికి పెరుగుతున్న కబ్జాల పర్వం..
నీటిపారుదల శాఖ రెవిన్యూ శాఖలో మారని తీరు..
మల్యాల (విజయక్రాంతి): మల్యాల భూముల ధరలు భారీగా పెరుగుతుండడంతో చెరువుల కుంటలపై అక్రమ ఆధారులు చెరువులు, కుంటలపై పడ్డారు. నీటి వనరులను వదలడం లేదు. గజాల చొప్పున కబ్జాకు పాల్పడుతున్నారు. అన్ని వర్గాలకు చెందిన కుంటలు చెరువులు పరిరక్షణ పట్టించుకోవడం లేదు. నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖ పురపాలక శాఖ గ్రామ శాఖ దృష్టి సాధించడం లేదు. హైదరాబాద్, వరంగల్ నగరాలలో చెరువులు మాయమవగా వాటి పేర్లు మిగిలివున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిరక్షణ చేపట్టకపోతే భవిష్యత్తులో పేర్లు మాత్రమే మిగిలే ప్రమాదం ఉందని పలువురు పరిశీలకులు చెబుతున్నారు.
మల్యాల, కొండగట్టు, తక్కల్లపల్లి, రాజారాం, మ్యాడంపల్లి, మానాల మల్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో మండల కేంద్రంలోని మార్కండేయ గుడిని నుండి కొండగట్టు వెళ్లే రహదారిని అనుకోని ఉన్న మల్యాల పరిహాక ప్రాంతంలో చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైడ్రాను ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటినా ఆచరణలో మాత్రం శూన్యం. ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించిన మండల కేంద్రాల్లో గ్రామాల్లో కబ్జాల గురైన అధికారులు చూసి చూడనట్టుగా ఉండడం వల్లనే భూబకాసురులు హద్దులు మీరుతున్నారు. చెరువులా క్రింద పంట పొలాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని అధికారులు చెరువుల రక్షణ తీసుకొని ప్రజలకు రైతులకు ఉపయోగపడేలా చెరువుల ఆక్రమణలు అడ్డుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు.