30-10-2025 07:44:29 PM
సనత్ నగర్, SRనగర్ లలో ప్రజాబాట ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యుత్ సంస్థల డైరెక్టర్ శ్రీ డాక్టర్ నరసింహులు, డైరెక్టర్ ఆపరేషన్, TGSPDCL
సనత్‌నగర్ (విజయక్రాంతి): జీరో అంతరాయాలే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని, దానికి తగ్గట్టుగానే LT నెట్వర్క్ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ వరకు తనిఖీలు చేసి ఎమన్నా లోపాలు ఉంటే సరిదిద్దెందుకు గాను ప్రజాబాట లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆపరేషన్ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్ శ్రీ నరసింహులు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ డా. నర్సింహులు, సంబంధిత SE/ బంజారాహిల్స్, DE/గ్రీన్ ల్యాండ్స్,ADE/సనత్ నగర్, AE/ సనత్ నగర్, AE/ SR నగర్ సెక్షన్ మరియు staff తో కలిసి ఈ రోజు గురువారం ఉదయం 8 గంటలకు బంజారాహిల్స్ సర్కిల్, గ్రీన్ ల్యాండ్స్ డివిజన్ పరిధిలోని సనత్ నగర్ సెక్షన్ లోని RTC బస్టాండ్ ఎస్ ఆర్ నగర్ సెక్షన్ లోని బాపు నగర్ లో ఉండే చిన్న చిన్న గల్లీల్లో కాలినడకన పర్యటిస్తూ అక్కడి వినియోగదారులతో మమేకమై మాట్లాడుతూ LT నెట్వర్క్ ను తనిఖీ చేసారు.
వేలాడుతున్న స్టార్, ఇంటర్ నెట్ కేబుల్స్, విద్యుత్ తీగలు, జాయింట్లు వున్న కేబుల్స్ లను గుర్తించి మార్చమని ఆదేశించారు సెక్షన్ అధికారులు (అసిస్టెంట్ ఇంజినీర్లు) ఉదయం ఎనిమిది గంటల నుండి తమ కార్యాచరణ మొదలు పెట్టాలని, ఏరియాల వారీగా LT నెట్వర్క్ లో పోల్ టు పోల్ తనిఖీలు చేయాలని ఎమన్నా లోపాలు ఉంటే సరి చేయాలన్నారు. విద్యుత్ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న నిరంతర కృషి వలన 33 కేవీ, 11 కేవీ నెట్వర్క్ లో చాలా వరకు సమస్యలు తగ్గాయన్నారు. భారీ గాలులు, వర్షం వలన ఎక్కడైనా చెట్లు/వాటి కొమ్మలు విరిగి స్తంభాల పై పదైనపుడు సరఫరా సమస్యలు ఏర్పడుతున్నాయని, వాటిని సైతం అతి తక్కువ సమయంలో పరిష్కరిస్తున్నామని డైరెక్టర్ గారు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రజా బాట కార్యక్రమం ప్రతి మంగళ వారం, గురువారం మరియు శనివారం ఉంటుందని అందులో మేము కూడా క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని వారు తెలిపారు. సంస్థ డైరెక్టర్/ఆపరేషన్ డా. నరసింహులు తో పాటు బంజారాహిల్స్ ఎస్ ఈ శ్రీ కరుణాకర్ బాబు, గ్రీన్ ల్యాండ్స్ డిఈ భీమా నాయక్, ఏడీఈ లు వంశీ కృష్ణ, కిషోర్ కుమార్, ఏఈ లు శేఖర్, మౌనిక ఇతర అధికారులు మరియు రెండు సెక్షన్ ల విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.