calender_icon.png 3 January, 2026 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్కెనపల్లి సైదులుకు డాక్టరేట్

03-01-2026 12:00:00 AM

మధ్యప్రదేశ్‌లోని పీకే యూనివర్సిటీ నుంచి ప్రదానం

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి) : హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అక్కెనపల్లి సైదులు గణిత శా స్త్రంలో డాక్టరేట్ పట్టా సాధించారు. మధ్యప్రదేశ్‌లోని శివపూరిలో ఉన్న పీకే యూనివ ర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పట్టాను అం దుకున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల గ్రా మానికి చెందిన అక్కెనపల్లి సైదులు ఇప్పటికే గణితం, భౌతికశాస్త్రాలతో పాటు సైకాలజీ, సోషియాలజీ తదితర కోర్సుల్లో మాస్టర్స్ చేసి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇప్పుడు తాజాగా గణిత శాస్త్రంలో ‘అడ్వాన్‌స్‌డ్ ఇన్వెంటరీ మోడల్స్ ఫర్ సబ్‌స్టిట్యూటబుల్, కంప్లిమెంటరీ, అండ్ ఇంపర్ఫెక్ట్ ఐటమ్స్: ఎ కాస్ట్ అండ్ సస్టునబిలిటీ అనాలిసిస్’ అనే అంశంపై థీసిస్ సబ్మిట్ చేసి డాక్టరే ట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ గణితంలో డాక్టరేట్ పొందడం నా చిన్ననాటి కల అన్నారు.  ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి రోజే డాక్టరేట్ పట్టా రావడం సంతోషంగా ఉం దన్నారు.