03-01-2026 12:00:00 AM
కేసముద్రం, జనవరి 2 (విజయక్రాంతి): ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి, కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్ నీలం సుహ సిని దుర్గేష్ బీఆర్ ఎస్‌ను వీడి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కేసముద్రం నుంచి దురేష్ తన అనుచరులతో పెద్ద ఎత్తు న హైదరాబాద్ తరలి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తొలుత కేసముద్రం పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ముదిరాజ్ కులస్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వె నుకబాటుకు గురైన ముదిరాజ్ కులస్తుల అభివృద్ధి కోసం తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించికున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ సహకారంతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో కేసముద్రం మండలలానికి చెందిన వారూ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళినాయక్ తదితరులు పాల్గొన్నారు.