21-09-2025 12:00:00 AM
సురేందర్ కుటుంబానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శ
ముషీరాబాద్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గాంధీనగర్ డివిజన్ బీజేపీ సీనియర్ నేత దివంగత ఆకుల సురేందర్ ఆకస్మిక మృతి పార్టీకి తీరనిలోటని హర్యా నా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి లు అన్నారు. ఈ మేరకు శనివారం సురేందర్ కుటుంబాన్ని మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిలు సందర్శించి పరామర్శించారు.
అనంతరం ఆకుల సురేందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ వారి అకాల మరణం డివిజన్‌లో బిజెపి పార్టీకి తీరని లోటని అన్నారు. బార్య జ్యోతి, కుమారుడు అభిషేక్, సోదరుడు శ్రీనివాస్‌లకు తమ ప్రగాఢ సానుభూ తి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు, రత్న సాయి చంద్, దామోదర్, శ్రీకాంత్, డి. స్వామి రెడ్డి, పి.నర్సింగ్ రావు, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, ప్రశాంత్ పాల్గొన్నారు.