21-09-2025 12:00:00 AM
స్టెమ్ స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని స్టెమ్ స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో శనివారం బతుకమ్మ వేడుకలను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు. సాం స్కృతిక కళలతో మహంకాళి అమ్మవారి వేషాధారణలతో ప్రకృతి పరవసించేలా సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించా రు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతా నికే ప్రత్యేకమైన ఈ పండుగను ప్రాచీన కాలం నుండి సాంప్రదాయకంగా జరుపుకుంటున్నామని, తెలంగాణలో అన్ని కుటుం బాలలోని ఆడపడుచులు వారి అన్నదమ్ములు కలకాలం ఆనందంగా జీవిం చాలని కోరారు. స్కూల్ డైరెక్టర్ కొండా కృష్ణవేణి మాట్లాడుతూ..
ఆడపిల్లలందరూ ప్రకృతిలోని తీరొక్కపూలను తెచ్చి మహాలయ అమావాస్య మొదలుకొని తొమ్మిది రోజులు సద్దుల బతుకమ్మతో పూల పండుగ జరుపుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ సం స్కృతిని, గొప్పతనాన్ని తెలియజేస్తూ కుటుంబమంతా కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని గౌరమ్మను పూజిస్తారని చెప్పా రు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.వి.ఆర్. మురళీమోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.