21-09-2025 12:00:00 AM
-రాంచిలో కర్మచారి సంపర్క్ సభలో ఎన్‌ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమం త్ సొరెన్ తరహాలోనే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎన్‌ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ కోరారు. శనివారం జర్ఖండ్ రాష్ట్రంలోని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షనర్స్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ఆఫీసర్స్, టీచర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (జార్ఖండ్ సీపీఎస్ యూని యన్), సీపీఎస్ యూనియన్ విక్రాంత్ అధక్షతన రాంచి పాఠశాల ప్రాంగణంలో కర్మ చారి సంపర్క్ మహాసమ్మేళన్ భారీ బహిరంగసభకు ఆయ న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్‌ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానము ను 2022లో రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జార్ఖండ్ రెవెన్యూశా ఖ మంత్రి దీపక్ బీరువా, ఉన్నత టెక్నికల్ విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్, ఎంపీ మహోవా తదితరులు పాల్గొన్నారు.