calender_icon.png 11 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిరాణా దుకాణం ముసుగులో అల్ఫజోలం వ్యాపారం

11-09-2025 01:59:03 AM

మాటేసి పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు 

నిజామాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెత్యవసర సరుకులు అమ్మ యొక్క దుకాణంలో నిషేధిత మత్తు పదార్థాలు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న విషయాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్టు రట్టు చేశారు.

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరంలోని గోశాల రోడ్డులో నిషేధిత మత్తు పదార్థాల ఆల్ఫాజూలం రావణ జరుగుతోందని అందుకున్న విశ్వాసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ బృందం దాడులు జరిపి తనిఖీలు నిర్వహించారు.

నిజామాబాద్ నగరంలోని ప్రధాన వ్యాపార సముదాయం గల గంజ్ వ్యాపార ప్రాంతంలో మత్తు పదార్థమైన అల్ఫాజూలం రావణ జరుగుతోంది అక్కడి నుండి అమ్మకాలు సాగుతున్నాయని అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం తనిఖీలు నిర్వహించింది. నిజామాబాద్ నగర శివారులోని కోజా కాలనీకి చెందిన అబ్దుల్ మాలిక్ దివానీ అనే వ్యక్తితో పాటు ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు.

అతని ద్విచక్ర వాహ నం స్కూటీ లో నిషేధిత మత్తు పదార్థం అల్ఫాజూలం 609 గ్రాములు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పట్టుబడింది. ఈ పట్టుబడిన ఆల్ఫాచోలం విలువ ఐదు నుండి ఆరు లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడిన 6 0 9 గ్రాముల అల్ఫాజూలంను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఆల్ఫా జోలంను కృత్రిమ రసాయనాలతో పాటు కల్తీకల్లు తయారు కోసం పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్ మాలిక్ దివానీ నడుపుతున్న కిరాణా దుకాణంలో ఈ అక్రమ మత్తు పదార్థ లా వ్యాపారం కొనసాగిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు.

ఈ ఆల్ఫా జోలో అక్రమ రవాణా పై సరుకు ఎక్కడి నుండి వస్తోంది ఎక్కడెక్కడికి సప్లై జరుగుతుంది అన్న విషయమై ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్త్స్ర రవికుమార్ హెడ్ కానిస్టేబుల్ రాజన్న నారాయణరెడ్డి కానిస్టేబుల్ హమీద్ శ్యాంసుందర్ శివ పాల్గొన్నారు.