calender_icon.png 11 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబోయ్ దోమలు..

11-09-2025 12:20:54 AM

- మండలంలో ఫాగింగ్ లేకపాయే

- భారీగా పెరుగుతున్న సీజనల్ వ్యాధులు

- గ్రామ ప్రజల గురించి పట్టించుకోని అధికారులు

బూర్గంపాడు,సెప్టెంబర్ 10,(విజయక్రాంతి):బూర్గంపాడు మండలంలోని ప్రజ లు దోమల బెడతతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామ పంచాయతీల అసమర్థత వల్ల పారిశుద్ద్య నిర్వహణ సక్రమంగా జరుగడం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పిచ్చి మొక్క లు, కుంటల్లో నీరు నిల్వ ఉంటోంది.

దీని వ ల్ల దోమల బెడద ఎక్కువవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివారించేందుకు గ్రామపంచాయతీలు చేస్తున్న కృషి అంతంత మాత్రంగానే ఉంది. ఫాగింగ్ మిషన్లు ఉన్నప్పటికీ వాడకుండా గ్రామ పంచాయతీ నుండి బయటకు తీయకుండా గ్రా మ పంచాయతీ కార్యదర్శులు కాలం గ డుపుతూ వస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

గ్రామాల్లో దోమల వ్యాప్తి విపరీతం గా పెరిగి ప్రజలు అనేక సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఫాగింగ్ చేయకపోవ డం వల్ల దోమల వ్యాప్తి పెరుగుతోంది.దీనివల్ల ప్రజలు డెంగ్యూ, మలేరియా,వైరల్ ఫీవ ర్ వంటి రోగాల బారిన పడుతూ ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు.

గత వర్షాకాలం నుండి అసలు ఫాగింగ్ చేసిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కనీసం వీధులలో బీజింగ్ పౌడర్ చల్లడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.కాబట్టి ఇ ప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో ఫాగింగ్,బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని ప్రజలు కోరుతున్నారు.