11-09-2025 01:55:48 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) ః సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా పోలీస్ అధికారులతో పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈనెల 15 కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బిసి డిక్లరేషన్ సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఈ భారీ బహిరంగ సభకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్ గేమ్, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తో పాటు కాంగ్రెస్ ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు సభా స్థలన్ని పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా సభాస్థలి, హెలిప్యాడ్, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు, వీఐపీలు రాకపోకల మార్గాలను ఎస్పీ పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీల రాకపోకలుకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భద్రత చర్యలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. అధికారులు సిబ్బంది అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి నర్సింహారెడ్డి, ఏ ఎస్ పి చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్త్స్ర తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.