calender_icon.png 11 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాకలి ఐలమ్మ స్ఫూర్తి అందరికీ ఆదర్శం

11-09-2025 02:01:52 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శం అని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్‌లో గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. తన హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో..

బాన్సువాడ సెప్టెంబర్ 10 (విజయ క్రాం తి): చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో గల చాకలి ఐలమ్మ విగ్ర హం వద్ద బుధవారం బీఆర్‌ఎస్  పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీనత వర్గాలకు కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందిన ఫలాలు ఇప్పుడు అందడం లేవు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ జడ్పిటిసి నార్ల రత్న కుమార్, నాయకులు మోచి గణేష్, సాయిబాబా, రమేష్ యాదవ్,శివ సూరి, సాకలి సాయి లు, సాకలి రాము గాండ్ల కృష్ణ, మహేష్, నాగనాథ్ ఉన్నారు.

బిచ్కుంద మండల కేంద్రంలో..

బిచ్కుంద సెప్టెంబర్ 10 (విజయక్రాం తి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భం గా కాంగ్రెస్ నాయకులు, రజక సంఘం నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భం గా వారు మాట్లాడుతూ...

తెలంగాణ తెగువ ను, పోరాట పటిమను ప్రపంచానికి చాకలి ఐలమ్మను స్మరించుకుందామన్నారు. వారు చూపిన బాటలో నడుస్తూ తెలంగాణ మహిళలను శక్తిమంతులుగా చేయడానికి తెలంగా ణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కతనిశ్చయంతో ఉందన్నారు. అధ్యక్షులు గంగాధర్, గోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సాయిని బస్వరాజ్, కొం డ్ర బాలకృష్ణ, నాగేష్, రాజు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి మండల కేంద్రంలో.. 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) ఎల్లారెడ్డి మండల కేంద్రంలో చాకలి ఐల్లమ్మ 40వ వర్ధంతి రోజున రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నింవాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు సాయి ప్రసాద్ మాట్లాడుతూ....  రెక్కడితేగాని డొక్కనిండాని బతుకు జీవుల కోసం కొంగు నడుముకు చుట్టి కొడవలి చేత పట్టి పంట ముడితే పానం తీస్తా నా కొడకా అంటూ శివంగిలా దొరల పైకి ఒంటరిగా దూకి ప్రాణాలకు తెగించి కొడవళి జులిపించడంతోనే  ఆ రోజుల్లో  ఇప్పుడు బీసీ లుగా ఎస్ సి లుగా చెప్పుకుంటున్న మనం ఈ మాత్రమైన దైర్యంగా నిలబడుతున్నాం.

ప్రతి పీడిత  కులంలో  ఐలమ్మ జయంతి  వర్ధంతి కార్యక్రామలు  జరుపుకోవాలన్నారు.  మున్సిపల్ కమిషనర్ మహేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయి బాబా, గౌరవ అధ్యక్షులు పర్వయ్య, ప్రధాన కార్యదర్శి సంఘమేశ్వర్, ఉపాధ్యక్షులు శేఖర్,  మహిళ అధ్యక్షురాలు స్వరూప, చరణ్ , ప్రవీణ్ , బుచ్చి పర్వయ్య, నాగమణి, నాగరాజు, శివ , రవి, అనిల్, సాయిలు,  రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.

తాడ్వాయి మండల కేంద్రంలో..

తాడ్వాయి, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రతినిధులు మాట్లాడుతూ సాకలి ఐలమ్మ ఒక వీరవనిత అని ఆమె పోరాటం మరిచిపోలేనిదన్నారు. ఆమె భూస్వాములను, పెత్తందారులను ఎదిరించి పోరాటం చేశారని తెలిపారు. నాయకులు మేకల రాజు, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

మహిళ లోకానికి స్ఫూర్తినిచ్చిన దీరవనిత

గాంధారి సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): మహిళ లోకానికి స్ఫూర్తినిచ్చిన దీరవనిత, తెలంగాణ సాయుద పోరాట యోదురాలు, స్వర్గీయ చాకలి ఐలమ్మ అని గాంధారి తాజా మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవులు యాదవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం రోజు చాకలి ఐలమ్మ 45వ వర్ధంతి సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో స్థానిక ఎస్త్స్ర ఆంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు రజక సంఘం నాయకులతో  కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సంద ర్భంగా గాంధారి తాజా మాజీ సర్పంచ్ మ మ్మాయి సంజీవులు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పోరాటం మరువలేనిదని సాయుధ పోరా టం చేసి తెలంగాణ సాధనలో ఎంతగానో పోరాడిందని ఆయన తెలిపారు. 

స్థానిక ఎస్సై ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీలు తూర్పు రాజులు, కామెల్లి బాలరాజు,  కమిటీ వైస్ చైర్మన్ రెడ్డి రాజులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగాని బాబా, మాజీ కోఆప్షన్ మెంబర్ ముస్తఫా, ప్రజా ప్రతినిధులు, నా యకులు, రజక సంఘాల ప్రతినిధులు చాక లి శ్రీనివాస్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు