22-07-2025 12:38:41 AM
కొత్తపల్లి, జూలై 21 (విజయ క్రాంతి): ఒక ప్రైవేట్ వేడుక మందిరంలో ‘నయా‘ పేరుతో నిర్వహించిన కొత్తపల్లిలోని అల్ఫో ర్స్ బాలుర జూనియర్ కళాశాల మరియు వావిలాలపల్లిలోని బాలికల జూనియర్ కళాశాల స్వాగత వేడుకలు కళా వైభవాన్ని చా టాయి. ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై సరస్వతి చిత్రపటానికి పూజ నిర్వహించి కా ర్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కళావైభవాన్ని చాటి చెప్పాలని, కళల పరిరక్షణకై సమయం కేటాయించాలని, విద్యార్థు లకు తెలియపరచాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమా లు అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులుపాల్గొన్నారు.