calender_icon.png 22 July, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ అనితారెడ్డికి ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా పీస్ అవార్డు

22-07-2025 12:39:15 AM

హనుమకొండ, జూలై 21 (విజయ క్రాంతి): అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్ పర్సన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, వరల్ వైజ్ కన్జుమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి కి ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ వారు ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా పీస్ అవార్డు-2025 సర్టిఫికేట్ లభించింది.  ప్రపంచ శాంతి కోసం, దేశభక్తి పెంపొందించే ఎన్నో రకాలగా కార్యక్రమాలు చేయడం.

ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉంటే కలిగే లాభాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహించడం అలాగే తన స్వంత పిల్లలకే కాక గత 30 సంవత్సరాలుగా అనాధ పిల్లలకు, మానసిక శారీరక దివ్యాంగులకు అమ్మ ప్రేమని అందిసు్తా వారిని స్వంత కర్చులతో చదివిస్తూ కావలసిన బాగోగులు చూస్తూ, కొందరు అనాధ పిల్లలకు పెళ్ళి సైతం చేయడం, వృద్దులను ఆదరిస్తుండడంతో వారి అత్యుత్తమ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసామని మనం పౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి తెలియ చేసారు. డాక్టర్ అనితారెడ్డి ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు లభించినందుకు సంతోషంగా ఉందని, అలాగే మరింత బాధ్యత పెంచిందని అన్నారు.