17-05-2025 12:00:00 AM
సిద్దిపేట, మే 16 (విజయక్రాంతి): జిల్లా లో విద్యాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సామాజిక బాధ్యతగా కృ షి చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో మెద క్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతి పై సమీక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వి ద్యాభివృద్ధి అనేది సామాజిక బాధ్యత అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాయని, ప్రజలు ప్రజా ప్రతినిధులు అందరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని జిల్లాల విద్యాభివృద్ధి కృషి చేయాలని అన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేయండి
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో ప్రజలు అధికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కోట్ల రూపాయలు వె చ్చించి నిర్మించిన క్యాటిల్ షెడ్స్ ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. ఎంపీ నిధులతో మంజూరు చేయించిన 44 పనులు త్వరగా పూర్తిచేసి వివరాలు అందించాలని, 16, 17 వ లోక్ సభల ఎంపీ నిధుల ద్వారా మం జూరై పూర్తికాని పనులు నిధుల వివరాలను అందించాలన్నారు.
తొగుట మండలంలో ఇరిగేషన్ కాలువల తవ్వకం వలన వచ్చిన మట్టి రాళ్ళను ప్రజల ఉపయోగం కోసం కొంత రుసుముతో ఇవ్వాలన్నారు. ఎన్సాన్ పల్లిలో రైతులకు, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారి 765 డిజి పై 5 వెంటల్స్ తో ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నామని లై బ్రరీ నుండి రంగదాంపల్లి ఊరు చివరి వర కు పిల్లర్స్ తో కూడిన ఫ్లై ఓవర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వo అనుమతి ఇచ్చిందని తెలిపారు.
సూర్యపేట, సిరిసిల్ల రహదారిని దుద్దెడ నుండి రాజీవ్ రహదారి వెంట సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మెదక్, ఎలుకతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా ఓపెన్ డ్రైన్లపై మూతలు ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రెండు వరసల మొక్కలు నాటాలన్నారు. దివ్యాంగుల ఉపకరణాలను పంపిణీ చేయడానికి ప్రత్యేక క్యాంపులతో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.
యువత డ్రగ్స్ బారిన పడకుండా కళాశాలల విద్యార్థులతో జూన్ రెండవ వా రంలో సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ క ల్పించాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే పండ్లు, పువ్వులు, నిడనిచ్చే మొక్కలను ఈజిఎస్ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పెద్ద మొత్తంలో నాటాలని అన్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ లను త్వరగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు.
పార్టీలకు అతీతంగా అర్హులకు మాత్రమే ఇందిర మ్మ ఇండ్లను అందించాలని, లూజ్ విద్యుత్ లైన్లను సరిచేయాలని, జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలలో కొత్త ట్రాన్స్ఫార్మర్లను బిగించాలని, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ అనుమతులు లేని, అనర్హులు గల ఆసుపత్రులను సీజ్ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో వచ్చే సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళిక బద్ధంగా విద్యాబోధన జరగాలన్నారు. మల్లన్న సాగర్ ఎఫెక్టెడ్ విలేజ్ తుక్కాపూర్ లో ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మిం చి త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా రుణం మంజూరు చేయాలన్నారు.
మూడు లక్షలు నేను ఇస్తా..
దుబ్బాకలో న్యాక్ సహకారంతో విదేశాలలో ఉపాధి పొందేలా ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, మేషన్, పిట్టర్ తదితర కోర్సులలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తికి ఎమ్మె ల్సీ అంజిరెడ్డి స్పందించారు. ఏర్పాటుకు అ వసరమైన రూ.3 లక్షలు తాను ఇస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి. ఎంఎల్సీలు సి. అంజిరెడ్డి, మల్క కొమరయ్య, జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, వి విధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.