పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
జహీరాబాద్, మే 8 : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సహాయాధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజు అన్నారు. బుధవారం జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నియో జకవర్గంలోని 313 పోలింగ్ కేంద్రాల వెల్ఫేర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు కోసం ర్యాంపులు ఏర్పా టు చేయాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవా లన్నారు. ఎన్నికల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పోలింగ్ కేంద్రా ల వసతుల కల్పనకు అవసరం అయ్యే ఖర్చుల నిమిత్తం ఒక్కొ పోలింగ్ కేంద్రానికి రూ. 4వేల చొప్పున వెల్ఫేర్ అధికారులకు అందజేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీవో మహేశ్, సురేశ్, పంచాయతీ కార్యద ర్శులు పాల్గొన్నారు.




