calender_icon.png 11 September, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలి

11-09-2025 06:00:13 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పౌర హక్కుల దినోత్సవం పకడ్బందీగా జరపాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పౌర హక్కుల దినోత్సవం నిర్వహించకపోవడంతో ప్రజలకు రాజ్యాంగంపై, పౌర హక్కులపై అవగాహన లేకుండా పోతుందని అన్నారు. గ్రామాలలో ప్రజలకు అవగాహన లోపించి అంటరానితనం, కుల వ్యవస్థ అసమానతలు పెరిగిపోతున్నాయి అన్నారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పావుర హక్కుల దినోత్సవం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేష్, నగేష్ ఉన్నారు.