calender_icon.png 15 September, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 ఆలౌట్ సౌతాఫ్రికా, శ్రీలంక తొలి టెస్టు

29-11-2024 12:00:00 AM

డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు లో శ్రీలంక అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. డర్బన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లంక తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే కుప్పకూలింది.  కమిందు మెండిస్ (13) టాప్ స్కోరర్. ఇటీవలే ఐపీఎల్ వేలం లో మెరిసిన మార్కో జాన్సెన్ (7/13) టెస్టు ల్లో కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు.

ఫలితంగా ఆస్ట్రేలియా బౌలర్ హ్యూ ట్రంబుల్ తర్వాత తన స్పెల్‌లో ఏడు ఓవర్లలోపే 7 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా జాన్సెన్ నిలిచా డు. 42 పరుగులకే కుప్పకూలిన లంక తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు మూటగట్టుకుంది. తద్వారా 20 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో నమోదైన 71 పరుగులు అత్యల్ప స్కోరు కనుమరుగయ్యింది.

లంకను ఆలౌట్ చేయ డానికి సఫారీలకు కేవలం 83 బంతులే (13.5 ఓవర్లు) అవసరమయ్యాయి. బంతుల పరంగా చూసుకుంటే ఇది రెండో అత్యల్పం. వందేళ్ల క్రితం (1924లో) సౌతాఫ్రికాను ఆలౌట్ చేయడానికి ఇంగ్లండ్ 75 బంతులు తీసుకుంది.