calender_icon.png 28 January, 2026 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాముత్తారంలో ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి బోల్తా

28-01-2026 10:49:19 AM

ఇద్దరు భక్తులు దుర్మరణం, పలువురికి గాయాలు

 అర్ధరాత్రి మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను దైర్యం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు 

మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బొమ్మపూర్ గ్రామానికి చెందిన భక్తులు మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వెళ్లి మంగవారం రాత్రి తిరిగి వస్తుండగా, మహా ముత్తారం మండలం పెగడపల్లి పెద్దవాగు వద్ద ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు భక్తులు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

సమాచారం అందుకున్న వెంటనే మంథని పట్టణంలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అర్ధరాత్రి హుటాహుటిన మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకొని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని వెంటనే వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు  బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. అదేవిధంగా సంఘటన స్థలానికి చేరుకొని ఈ ప్రమాదానికి గల కారణాలను కాటారం డీఎస్పీ ని, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని మంత్రి దైర్యం చెప్పారు.