28-01-2026 10:46:25 AM
ప్రజావేదిక సాక్షిగా వెలుగులోకి వచ్చిన ఈజిఎస్ అవకతవకలు
రికవరీ, పెనాల్టీలు రూ 39వేలు
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జమలారెడ్డి అధ్యక్షతన 18వ విడత ప్రజావేదికలో మండల వ్యాప్తంగా 18 గ్రామ పంచాయతీలలో నిర్వహించిన సామాజిక తనిఖీ బృందాలు తనిఖీ నిర్వహించి గ్రామ సభలు నిర్వహించిన అనంతరం సంభందిత నివేధికలను ప్రజావేదికలో చదివి వినిపించారు. ప్రతి పంచాయతీలోనూ డిమాండ్ నో డిమాండ్ అనేది చూపకపోవడం సర్వసామాన్యమైంది.అలాగే పని జరిగిన ప్రదేశంలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పై ఆడిట్ అధికారులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కొంతమంది పనిచేసినప్పటికీ వారికి నేటికి వారి ఖాతాలో జమ కాలేదని అధికారుల ముందు ఉంచారు. అలాగే పని వేతనం కంటే అదనంగా చెల్లించినట్లు గుర్తించారు . కొంతమంది పనులకు రాకపోయినా వారి ఖాతాలో నగదు జమ అయినట్లు గుర్తించారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉపాధి హామీ పనికి సంబంధించి నోటీసు బోర్డులు ఏర్పాటు చేయవలసి ఉన్న కొన్ని గ్రామపంచాయతీలలో నోటీసు బోర్డులు ఏర్పాటు చేయలేదని తెలియజేశారు. పంచాయతీలలో జరిగిన అవకతవకలపై ఏపీ డి రవి అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సామాజిక తనిఖీ వేదికకు సకాలంలో కార్యదర్శులు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకే సమస్య సామాజిక తనిఖీ వేదికలలో పదేపదే పునరావృతం అయితే దానికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయడం కాకుండా పూర్తిగా విధుల నుంచి తొలగించే నిబంధన ఉందని ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సామాజిక వేదికలో బయటపడ్డ సమస్యలను భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించారు.భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామని ఏపీఓ విజయలక్ష్మి సమాధానం ఇచ్చారు.18వ సామాజిక తనిఖీ ప్రజావేదికకు ఉపాధిహామీ కూలీలు డిమాండ్ ఇచ్చిన రైతులు పనులు చేయించుకున్న రైతులు హాజరు కాకపోవడం గమనార్హం, వారికి సమాచారం లేకపోవడమా, వారే రాలేదా అనేది సంభందిత అధికారులకు తెలియాలి. ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులు హాజరయ్యారు .వారిని ఉద్దేశించి ఉన్నత అధికారులు మాట్లాడుతూ విలేజ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులు తెలిపారు.సామాజిక తనిఖీ ప్రజా వేదిక లో ఎప్పటిలాగానే నాటిన మొక్కలు చనిపోయినట్లు కొన్ని బతికి ఉంచినట్లు వ్యవసాయదారులకు మునగ, యుకాలిప్టస్ మొక్కలు పంపిణీ చేసిన అవి బతకలేదని వాటి స్థానంలో వేరే పంట పండించారని నివేదికలో చదివి వినిపించారు.ఇలా అవసరంలేని రైతులకు పంటలు పండించాలని ఎస్టిమేషన్ వేసి మొక్కలు పంపిణీ చేసి వేల రూపాయలు ప్రభుత్వం ధనం వృధా చేయడం ఆ పంట స్థానంలో వేరే పంట వేసామని చూయించటం పరిపాటి అయిపోయింది.
ఉపాధి హామీ ప్రజా ఉపయోగంగా ఉండాల్సింది పోయి వృధాగా మారింది.ఒకరి పనిని ఇంకొకరు చేసినట్లు చూపించటం వంటివి వెలుగులోకి వచ్చాయి. చేసిన పనికి నగదు జమ కాకపోవడం సంతకాలు కొట్టివేతలు ఉండడం పనికి తగిన వేతనం అందకపోవడం చేసిన పని కంటే ఎక్కువ వేతనం చెల్లించడం వంటివి వెలుగులోకి వచ్చాయి. మరలా ఇది పునరావృతం కావద్దని తెలియజేస్తూనే ఉన్నారు. నర్సరీలలో మొక్కలు పెంచారు వాటి నిర్వహణ అంతంత మాత్రమే కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసినట్లుగా పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో మొక్కలు నాటితే చనిపోయాయని చూయించారు. జరిగిన తప్పులే ఈజీఎస్ సిబ్బంది వాటిని మరలా మరలా పునరావృతం చేస్తూనే ఉన్నారు . పంచాయతీల వారీగా లక్ష్మీపురం,నకిరి పేట, వేపల గడ్డ,సారపాక, ఇర వెండి, తాళ్ల గొమ్మూరు, కోయగూడెం,ఇర వెండి,తాళ్ల గొమ్మూరు, మోతే, నాగినేని ప్రోలు , టేకుల చెరువు,బూర్గంపహాడ్,పినపాక పట్టి నగర్, ఉప్పు సాక ,మొరంపల్లి బంజర, కృష్ణ సాగర్ , అంజనాపురం గ్రామపంచాయతీ నివేదికను బిఆర్పి చదివి వినిపించారు. ఆడిట్ కు సంబంధించి పూర్తిస్థాయి నివేదికనులను ఎస్ఆర్పి రాజశేఖర్ అదనపు డిఆర్డిఓ కి అందజేశారు . ప్రజావేదికలో అదనపు డి ఆర్ డి ఓ రవి అవకతవకలును వెల్లడించారు.రికవరీ,పెనాల్టీ మెత్తం రూ39,409 విధించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివివివొ రమణ,ఆడిట్ బృందం ఇంచార్జ్ అనూష, అమ్ముడ్స్ ఎస్ పి ఎమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు