calender_icon.png 15 September, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసీస్ ప్రధానితో టీమిండియా

29-11-2024 12:00:00 AM

కాన్‌బెర్రా: బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా బృందం ఆ దేశ ప్రధాని ఆంథోని అల్బానీస్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయింది. రెండో టెస్టుకు సమయం ఉండడంతో ఈ నెల 30 నుంచి భారత జట్టు ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టుతో రెండు రోజుల పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

ఈ నేపథ్యంలో గురువారం రోహిత్ ఆధ్వర్యంలోని టీమిండియా ప్రాక్టీస్‌కు ముందు ప్రధానితో ఫోటో సెషన్‌లో పాల్గొం ది. ఈ సందర్భంగా ప్రొటోకాల్ ప్రకారం కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సభ్యులను పరిచయం చేశాడు. అనంతరం భారత ఆటగాళ్లతో కరచాలనం చేసిన ప్రధాని సరదాగా ముచ్చటించా డు. ఈ సందర్భంగా పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియాను అభినందనల్లో ముంచెత్తాడు.

తొలి టెస్టులో సెంచరీలు చేసిన కోహ్లీ, జైస్వాల్‌తో ప్రత్యేకంగా ముచ్చ టించిన ఆంథోని అల్బానీస్ ఆ తర్వాత బుమ్రాపై పొగడ్తల వర్షం కురిపించాడు. గతేడాది భారత్‌కు విచ్చేసిన ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బానీస్‌తో కలిసి అహ్మదాబాద్ స్టేడియానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్, ఆసీస్ ఆటగాళ్లతో కరచాలనం చేశారు.