28-01-2026 10:47:28 AM
మంథని జనవరి 28 (విజయక్రాంతి): మంథని పట్టణంలోని మండలంలోని బాధిత కుటుంబాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మంథని పట్టణంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు భాగవతుల శంకర్ తల్లి అమృతమ్మ మరణించగా వారి కుటుంబ సభ్యులను, ఇటీవల గుండెపోటుతో చెందిన గీట్ల అజయ్ రెడ్డి కుటుంబ సభ్యులను, గూడూరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన యువకుడు దేవేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదం మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.