28-01-2026 10:44:01 AM
జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్
చుంచుపల్లి, (విజయక్రాంతి): క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. రామవరం సాధన గ్రౌండ్ లో గెట్ టు గెదర్ లెజెండ్స్ క్రికెట్ పోటీలలో ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన యంగ్ స్టార్స్ టీమ్ కు కప్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలకు వయస్సుతో సంబంధం ఉండదని ఈ టోర్నమెంట్ ద్వారా నిరూపితమైందన్నారు. ప్రతీ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరగడం గొప్ప విషయమన్నారు.
క్రికెట్ పోటీలు నిర్వహించడం ప్రస్తుత తరుణంలో అంత ఆషామాషీ విషయం కాదని పేర్కొన్నారు. ప్రతీ పోటీల్లో గెలుపు,ఓటములు సహజమని గెలుపొందిన వారు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని,ఓటమి చెందిన వారు మరింత సాధన చేసి భవిష్యత్తు లో గెలుపొందుటకు కృషి చేయాలన్నారు.ఫైనల్ మ్యాచ్ యంగ్ స్టార్స్ జట్టుకి,సింగరేణి లెవన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సింగరేణి లెవెన్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 73 పరుగులు చేయగా యంగ్ స్టార్స్ లెవెన్ జట్టు 6 ఓవర్లలోనే 74 పరుగులు చేసి గెలుపొందారు.యంగ్ స్టార్ జట్టు క్రీడాకారుడు విజయ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ట్రోపి గెలుపొందారు. ఈకార్యక్రమంలో తోట వెంకట్,దేవర్ల రాజు,యెర్రా లింగేశ్,రాజా రమేష్,పుష్పరాజ్,కందుల నాగేశ్వరరావు,దుస్యంత్ తదితరులు పాల్గొన్నారు