calender_icon.png 3 August, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భావితరాలకు అందించాలి

03-08-2025 08:23:34 PM

జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు

జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. ప్రభుద్ధ భారత్ ఇంటర్నేషనల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  "ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం" కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారిలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగిత్యాల తాసిల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చీటి శ్రీనివాసరావు  మాట్లాడుతూ ఈరోజు బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అవుతున్నారంటే అంబేద్కర్ చేసిన కృషి ద్వారానే సాధ్యమైందన్నారు. వారి జీవితాన్ని త్యాగం చేసి అణగారిన, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడి రాజ్యాంగ బద్దంగా వాటిని సాధించి చట్టరూపంలో కార్యరూపం సాధించుటకు అహర్నిశలు పాటు పడ్డారన్నారు.

జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారి  మాట్లాడుతూ... ఆనాటి సమాజంలో అంటరాని కులంగా భావించబడే మహర్ కులం లో జన్మించిన అంబేద్కర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కేవలం చదువు ద్వారానే ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డారని కొనియాడారు. విజ్ఞానం వల్లనే అంటరానితనం అనే జాడ్యం అంతమవుతుందని విశ్వసించి ఆచరణలో చూపారన్నారు. దేశంలో మొట్ట మొదటి డాక్టరేట్ పొందిన వ్యక్తి. వారిలా అనేక డిగ్రీలు పొందిన వారు ప్రపంచంలో ఎవరు లేరని అందుకే అంబేద్కర్ కు ఐక్యరాజ్యసమితి ప్రపంచ మేధావి అని ప్రశంస అందించిందన్నారు.

ప్రపంచంలో అగ్రరాజ్యం గా చెప్పుకునే అమెరికా కూడా  మహిళలకు ఓటు హక్కు ఇవ్వని సందర్భంలో భారతదేశానికి స్వతంత్రం సిద్ధించగానే దేశంలో ఉన్న మహిళలకు ఓటుహక్కు ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు.  అయన జీవిత కాలం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, హక్కుల కోసమే పోరాడారన్నారు. అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు అందించే ఇలాంటి కార్యక్రమం లో అన్ని రకాలుగా తమ అసోసియేషన్ సహకారం అందిస్తుందని తెలిపారు.