17-10-2025 06:18:44 PM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): స్వాతంత్య్రం వచ్చిననాటి నుండి బీసీలకు రాజ్యాంగ ఫలాలు, స్వాతంత్య్ర ఫలాలు సక్రమంగా అందడం లేదని, అమలు కావడం లేదని, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందడం లేదని గత కొన్ని దశాబ్దాల నుండి బీసీలు పోరాటాలు చేస్తుండగా, ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టగా, రాష్ట్ర జనాభాలో బీసీలు 57.6 శాతం ఉన్నట్లుగా తేలడంతో, బీసీలకు స్థానిక ఎన్నికల్లో,విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, అసెంబ్లీలో అఖిలపక్షం ఏకగ్రీవంగా రెండు బిల్లులను ఆమోదించి గవర్నర్ గారి ఆమోదంతో, పార్లమెంట్లో ఆమోదం పొందుటకు, షెడ్యూల్ 9 లో చేర్చుటకు గాను పంపిన రెండు బిల్లులు పెండింగ్లో ఉండడం చాల బాధాకరం.
పంచాయతీ రాజ్ చట్టం, పురపాలక చట్టాన్ని సవరిస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, మరల అసెంబ్లీ తీర్మానంతో గవర్నర్ ఆమోదకై పంపిన ఆర్డినెన్స్ లు పెండింగ్లో ఉండడంతో, సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్లు మించరాధన్న షరతులను, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో 9 ద్వార సవరించి రిజర్వేషన్లను 42 శాతం కల్పిస్తూ,ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని,ఈ రోజు మున్నూరు కాపు సంఘ భవనంలో జరిగిన బీసీ జేఏసీ అఖిలపక్షం. నేతల సమావేశంలో బీసీ నేతలు పొలాస నరేందర్, బొజ్జ కనుకయ్యా,రాపెల్లి శ్రీధర్, ఇప్పపూల అజయ్, సిహెచ్.రామస్వామి గౌడ్, బత్తుల మహేందర్, చాకినాల అమర్ తదితరుల ప్రసంగాల్లో అన్నారు.
ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 పైన,ఎన్నికల నోటిఫికేషన్ పైన, బీసీ వ్యతిరేకులు పగతో, కుట్రలు పన్ని హైకోర్టులో, సుప్రీం కోర్టులో కేసులు వేయగా, కోర్టులు విచారణ జరిపి జీవో 9 పైన, నోటిఫికేషన్ పైన "స్టే" విధిస్తూ తీర్పు నివ్వడాన్ని నిరసిస్తూ, రాష్ట్ర బీసీ జేఏసి పిలుపు మేరకు అఖిలపక్షం మద్దతుతో రేపు వేములవాడ బందుకు పిలుపు నివ్వడం జరిగిందని, ఇట్టి బందులో బీసీ, జేఏసీ, అఖిలపక్షం నేతలు, అన్ని వర్గాల వారు పాల్గొని రేపటి వేములవాడ బంధు విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. రేపటి బంధుంకు వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు, హోటళ్ళు, సినిమా థియేటర్లు, చిరు వ్యాపారులు బంధు పాటించి, సహకరించి, బంధును విజయవంతం చేయాలని బీసీ నేతలు, అఖిలపక్షం నేతలు వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.