17-10-2025 09:12:05 PM
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వలిగొండ,(విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ మండలంలోని మాందాపురం, మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు తమ ధాన్యాన్ని మధ్య దళారులకు అన్ని మోసపోవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్మి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని తేమ,తాలు, మట్టి లేకుండా చూసుకోవాలని మార్కెట్ యార్డులోని యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.