03-05-2024 01:42:43 AM
తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ రాజ్భవన్ ఉద్యోగిని ఫిర్యాదు
కోల్‌కత్తా, మే 2: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై లైంగిక ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. తనపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ గవర్నర్ కార్యా లయంలో పనిచేసే ఓ తాత్కాలిక ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఆరోపణలను రాజ్‌భవన్ ఓ ప్రకటనలో కొట్టిపారేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి ఆరోపణలతో రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వారికి దేవుడు అండగా ఉంటారంటూ గవర్నర్ ఎద్దే వా చేశారు. అవినీతి, హింసకు వ్యతిరేకంగా తన పోరాటం ఆగదన్నారు.